జీఎస్టీ దేశం యొక్క పరోక్ష పన్ను విధానాన్ని సంఘటితపరిచింది. పన్ను అనుసరణను సులభం చేసింది మరియు జీఎస్టీకి ముందు పన్ను విధానం యొక్క క్లిష్టతలను తగ్గించింది. జీఎస్టీ యొక్క ఈ ప్రయాణంలో ఒక కీలకమైన అంశం జీఎస్టీ మండలి. జీఎస్టీమండలి ఒక రాజ్యంగబద్ధమైన సంస్థ. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ఈ మండలికి అధ్యక్షత వహిస్తారు. జీఎస్టీ మండలి పని చేయడంలో కో-ఆపరేటివ్ ఫెడరలిజం ఒక కీలకమైన మార్గదర్శకత్వం వహించే అంశం. మండలి ఇప్పటి వరకు 49 సమావేశాలు నిర్వహించింది. కో-ఆపరేటివ్ ఫెడరలిజమ్ స్పూర్తితో సుమారు 1500 నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీ చట్టంతో వాణిజ్యం సానుకూలమైన అనుభవం పొందిందని విశ్లేషణ చూపించింది. సరఫరా గొలుసు అనుకూలీకరణ మరియు సేవల వ్యవయంలో తగ్గుదల కూడా ఉంది. జీఎస్టీ మండలి యొక్క 50వ సమావేశం ఒక గొప్ప సమావేశంగా నిలిచింది. కో-ఆపరేటివ్ ఫెడరలిజమ్ విజయాన్ని మరియు సరుకులు & సరళమైన పన్ను విధానాన్ని సూచించే మైలురాయి ఇది.
































