శుక్రియా (మీకు ధన్యవాదాలు). గడచిన 75 సంవత్సరాలు గా ఆర్థిక సేవ ల రంగం లో మార్పు ను తీసుకు రావడం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియ జేయడం కోసం ఉపయోగించిన మాటే శుక్రియా. కోవిడ్-19 మహమ్మారి కాలం లో అసాధారణమైనటువంటి అంకిత భావాన్ని, నైతిక ధైర్యాన్ని కనబరచడం ద్వారా మరే ఇతర రంగం లోని ఫ్రంట్- లైన్ వర్కర్ ల వలెనే ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం వర్కర్ లు సైతం పరిశ్రమించారు. మరి వారు ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడాను ఈ రంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచారు.
































